గొల్లపెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్
నవగీతం,జగిత్యాల ప్రతినిధి :
భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత మాట్లాడారు. భూ భారతికి సంబంధించిన పెండింగ్ అంశాలు, ఓటరు జాబితా సవరణ, ఇరిగేషన్ ట్యాంక్స్ సెన్సెక్స్ సంబంధించిన అంశాలపై చర్చించారు. నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సర్టిఫికెట్ల ప్రజలకు అందించవలసిందిగా అధికారులకు ఆదేశించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్ఓల పాత్ర కీలకమని చెప్పారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి ఓటరు నమోదు చేయాలని వివరాలు సరిచూడాలన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. అనర్హుల పేర్లను నిబంధనల మేరకు తొలగించాలని సూచించారు. వయస్సు, చిరునామా వంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఫోటోలు, ఆధార పత్రాలను పరిశీలించాలని తెలిపారు. ఫారమ్ 6, 7, 8లను సక్రమంగా స్వీకరించాలన్నారు. స్వీకరించిన దరఖాస్తులను సకాలంలో ప్రాసెస్ చేయాలన్నారు. డూప్లికేట్ నమోదులు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా డేటా అప్‌లోడ్ చేయాలన్నారు. పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అందరు సమన్వయంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పట్టణ,గ్రామ, వార్డు స్థాయిలో పర్యవేక్షణ పెంచాలన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువైనదని గుర్తు చేశారు. ఎన్నికల స్వచ్ఛతకు అందరూ సహకరించాలని కోరారు. బాధ్యతాయుతమైన పని విధానం అవసరమన్నారు. లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించాలని చెప్పారు. నివేదికలను సమయానికి సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామాల్లోని చెరువుల యొక్క గణాంకాలు నీటి పారుదల శాఖ తో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా ఉండేలా చూడాలని జిపివోలను ఆదేశించారు. ఈ సమావేశంలో గొల్లపెల్లి తహసీల్దార్ అబ్దుల్ మాజిద్, రెవెన్యూ సిబ్బంది, జీపివోలు, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.