navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 8:56 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

భేటీ బచావో బేటి పడావో  పై అవగాహన

నవగీతం, మల్లాపూర్:

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలం వేంపల్లిలో గురువారం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో అవగాహన కల్పించారు. ఈ అవగాహనకు వేంపల్లి ,వెంకటరావు పేట గ్రామల సర్పంచులు గ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోస్టల్ శాఖ అధికారులు మాట్లాడుతూ సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి వివరించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవాలని, పోస్టల్ శాఖలో ఇన్సూరెన్సులు గురించి అవగాహన కల్పించి గ్రామ ప్రజలకు చేరవేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ గూగ్లావత్ రాజేందర్ వెంకట్రావుపేట్ సర్పంచ్ కనుమల వెంకటేష్, పోస్టు అధికారి సుమతి , వివిధ శాఖల అధికారులు,పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.