navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 12:34 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శ్రీ బోలెనాథ్ కర్బాల దేవస్ధానం

నేటి మొదలు మూడు రోజుల పాటు ఉత్సవాలు

దీపాల కాంతులు, ప్రత్యేక పూల అలంకరణలో ఆలయం

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

హిందువులు ఆరాధ్యంగా పూజించే పరమశివునికి ఉపవాసాలు జాగరణలతో భజన సంకీర్తనలు చేస్తూ అతి ప్రధానమైన పూజ మహాశివరాత్రి పర్వదినం శివరాత్రి పర్వదిన ఉత్సవాలకు అన్ని శివాలయాలు ఉత్సవాలకు ముచ్చబోతున్నాయి. ఆలయ కమిటీలు గత రెండు రోజులుగా ప్రత్యేక దీపాలంకరణ పచ్చని చలవపందిళ్లు పూల అలంకరణ చేసి ఏర్పాట్లను చేశారు.

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో శ్రీ బోలేనాథ్ కర్వాల్ ఆలయం లో అతి పెద్ద శివలింగం శివపార్వతుల సమూహం తో కూడిన పెద్ద పెద్ద ప్రతిమలకు అలంకరణ చేసి మహాశివరాత్రి ఏర్పాట్లలో భాగంగా ఆలయంలో చక్కటి పూలా ఆలంకరణ చలువ పందిల్లు విద్యుత్ కాంతుల ఏర్పాటుచేసి మూడు రోజులపాటు ఉత్సవాలను జరిపేందుకు అన్ని సిద్ధం చేసి ఉంచారు.

ఈ ఆలయానికి ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ ,కరీంనగర్ జిల్లాల నుండి భారీగా భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

ఈసందర్భంగా సోంతి మెహన్ యెగి నూతచేయనున్న ముఖ్యసిద్ధాంతాలు వ్యక్తం చేస్తు అనాధాపిల్లలకు విద్య వైద్యం భోజనంతో పాటు యోగ శిక్షణతో పిల్లలకు మెరుగు అయినటువంటి భవిషత్తునిఇవ్వడమే మా ముఖ్య సిద్ధాంతమన్నారు. అలాగే గత కొన్ని రోజుల నుండి ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బోలెనాథ్ కర్బల వ్యవస్ధాపాకులు పెర్కోన్నారు.