మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం

నవగీతం,రుద్రంగి: మహిళల రక్షణకు షి టీమ్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం షీ టీం జిల్లా ఇంచార్జ్ ప్రమీల విద్యార్థులకు అవగాహన కల్పించాచారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. మహిళలు, యువతులు, బాలికలు ఆకతాయిల వలన గాని, మరే విధమైన వేధింపుల వలన గాని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా షీటీమ్స్ ని సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలో విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల,...