navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 12:05 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి ఎన్నికల ప్రచారం

నవగీతం, వైరా:

వైరా 12 వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న మాదినేని సునీత విజయాన్ని కాంక్షిస్తూ మాజీ శాసనసభ్యురాలు బానోతు చంద్రావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. వైరా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు అడగటానికి వస్తారని వారి ఎత్తులు చిత్తులను ప్రజలు గమనించి ఆలోచించి మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఆమె కోరారు.

మహిళలను ఓట్ల అభ్యర్థిస్తున్న దృశ్యం

ఈ ప్రచార కార్యక్రమంలో రంగా వాసవి, మిట్టపల్లి కిరణ్ కుమార్, కొల్లా రాంబాబు ,మాదినేని సత్యనారాయణ, మాదినేని దుర్గాప్రసాద్, రంగ సత్యనారాయణ, కట్ల నాగేశ్వరరావు మిట్టపల్లి నరసింహారావు, నాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.