navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 3:35 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మామిడి తోటలు సందర్శించిన జిల్లా ఉద్యాన అధికారి.

నవగీతం,కోరుట్ల రూరల్:

కోరుట్ల మండలంలోని పలు గ్రామాల్లోని మామిడి తోటలను గురువారం జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు మామిడి తోటలకు అనుకూలంగా ఉండడం వలన జగిత్యాల జిల్లా మామిడి రైతులు అప్రమత్తంగా ఉండి ముందస్తుగా సస్యరక్షణ చర్యలు, సకాలంలో పురుగు మందులు స్ప్రే చేయడం, సమయానుకుల నీటి తడులు ఇవ్వడం వలన మామిడి తోటలలో విపరీతంగా పూత రావడం జరిగింది, ప్రస్తుతం తెల్ల పూత దశ నుండి నల్ల పూత దశకు చేరుకుని మడిపోయిన పూత రాలిపోయి జొన్న గింజ సైజ్ లో మామిడి పిందెలు కనబడతాయి, అధిక పూత రావడం వలన పూత రాలడం సహజంగానే జరుగుతుంది, కావున రైతులు ఈ విషయంలో దిగులు చెందవద్దని తెలిపారు, కొన్ని తోటలలో పచ్చి పూత దశలో అధికంగా నీరు పారించిన తోటలలో తేనేమంచు పురుగు కనబడుతోంది, అదే విధంగా గాలి చొరబడకుండా విపరీతంగా పూత రావడం వలన దోమ ఉదృతి కూడా ఉంటుంది వీటి నివారణకు వేపనూనె 10000 PPM లీటరు నీటికి 1 ml చొప్పున , టోల్ఫైన్ పైరైడ్ 1 ml మరియు ప్రొఫైకొనజోల్ 1 ml మరియు ప్లానోపీక్స్ 0.2 ml చొప్పున కలిపి పూత రాలకుండా చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి శ్యామ్ ప్రసాద్ , కోరుట్ల హెచ్ ఈ ఓ అన్వేష్ , అభ్యుదయ రైతు మిట్టపల్లి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.