పది స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ
చెరో ఆరు స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్
నలుగురు స్వతంత్ర అభ్యర్థుల విజయం
మున్సిపల్ చైర్మన్ పై బీజేపీ గురి..??
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
మున్సిపల్ ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిన బీజేపీ తన హవా చూపించింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీలో ఏకంగా 10 స్థానాల్లో ఘన విజయం సాధించి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతోంది. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కంటే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఏకంగా 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల మెట్ పల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 26 వార్డుల్లో బీజేపీ 10 స్థానాల్లో గెలుపొందింది. అధికార పార్టీ అయినా కాంగ్రెస్ ఆరు స్థానాల్లో, బీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాలు సాధించగా నలుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
గెలుపొందిన అభ్యర్థులు…
ఒకటో వార్డు నుంచి ఓంకారి నవీన్ (కాంగ్రెస్), రెండో వార్డు జక్కం లక్ష్మి (బీఆర్ఎస్), మూడో వార్డు బత్తుల నరేష్ (కాంగ్రెస్), నాలుగో వార్డు పందిరి రమేష్ (స్వతంత్ర), ఐదో వార్డు పుడుకారం దివ్య కిషోర్ రెడ్డి (బీజేపీ), ఆరో వార్డు బంగారు కాళ్ల నీరజ (బీఆర్ఎస్), ఏడో వార్డు ధర్మపురి స్వరూప (బీజేపీ), ఎనిమిదో వార్డు దీవకొండ మానస (బీఆర్ఎస్), తొమ్మిదో వార్డు నుండి బొడ్ల వసుధ నాగేష్ (బీజేపీ), పదో వార్డు నునుగొండ నరేష్ (కాంగ్రెస్), 11వ వార్డు రెబ్బాసు మహేష్ (స్వతంత్ర), 12వ వార్డు సుమాయ తబుస్సమ్ (స్వతంత్ర), 13వ వార్డు గుడికందుల అజయ్ (కాంగ్రెస్), 14వ వార్డు నుంచి దొనికెల శిరీష నవీన్ (బీజేపీ), 15వ వార్డు నుంచి అరిగెల శిరీష రాకేష్ (బీజేపీ), 16వ వార్డు నుండి అరిసె వనజ మురళీ (బీజేపీ), 17వ వార్డు నుండి మైలారపు లింబాద్రి (కాంగ్రెస్), 18 వ వార్డు నుండి చెట్లపల్లి మీనా సుఖేందర్ గౌడ్, 19వ వార్డు నుంచి బొడ్ల ఆనంద్ (బీజేపీ), 20వ వార్డు నుంచి మాసుల ప్రవీణ్ (కాంగ్రెస్), 21వ వార్డు నుంచి కాజా అజీముద్దీన్ (స్వతంత్ర), 22వ వార్డు అంగడి పురుషోత్తం (బీఆర్ఎస్), 23వ వార్డు నుంచి కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ (బీజేపీ), 24వ వార్డు నుంచి పూదరి జ్యోతి (బీఆర్ఎస్), 25వ వార్డు నుంచి ఆశ్ర ఫర్హిన (బీఆర్ఎస్), 26వ వార్డు నుంచి బొడ్ల రమేష్ (బీజేపీ) తరపున విజయం సాధించారు.
మున్సిపల్ చైర్మన్ పై బీజేపీ గురి..??
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పది స్థానాల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన పావులు కదుపుతోంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఏకంగా 10 స్థానాలు సాధించడం పట్ల పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 14 ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినవారు చైర్మన్ స్థానం ఎంపికలో కీలకం కానున్నారు. స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇచ్చినవారు లేదా, అధికార పార్టీ కాంగ్రెస్ కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో చైర్మన్ స్థానం భర్తీ కానుంది.