ధర్మపురిలో అధికార పార్టీ క్లీన్ స్వీప్
కోరుట్లలో 17 స్థానాలతో కాంగ్రెస్
మున్సిపల్ కైవసం
జగిత్యాలలో ఇండిపెండెంట్ ల హవా
మెట్ పల్లిలో బీజేపీకి 10 స్థానాలు
రాయికల్ లో బీజేపీకి 5 స్థానాలు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాల జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించి క్లీన్ స్వీప్ కొట్టేసింది. జగిత్యాలలో స్వతంత్ర అభ్యర్థుల హవా కొనసాగింది. కోరుట్లలో కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలిచింది. మెట్ పల్లిలో బీజేపీ పది స్థానాల్లో విజయం సాధించి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. రాయికల్ మున్సిపల్ లో ఐదుగురు అభ్యర్థులు బీజేపీ పార్టీ తరఫున గెలుపొంది చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా గెలుపొందిన మున్సిపల్ కౌన్సిలర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
మెట్ పల్లిలో గెలుపొందిన అభ్యర్థులు…
మెట్ పల్లి మున్సిపల్ లో ఒకటో వార్డు నుంచి ఓంకారి నవీన్ (కాంగ్రెస్), రెండో వార్డు జక్కం లక్ష్మి (బీఆర్ఎస్), మూడో వార్డు బత్తుల నరేష్ (కాంగ్రెస్), నాలుగో వార్డు పందిరి రమేష్ (స్వతంత్ర), ఐదో వార్డు పుడుకారం దివ్య కిషోర్ రెడ్డి (బీజేపీ), ఆరో వార్డు బంగారు కాళ్ల నీరజ (బీఆర్ఎస్), ఏడో వార్డు ధర్మపురి స్వరూప (బీజేపీ), ఎనిమిదో వార్డు దీవకొండ మానస (బీఆర్ఎస్), తొమ్మిదో వార్డు నుండి బొడ్ల వసుధ నాగేష్ (బీజేపీ), పదో వార్డు నునుగొండ నరేష్ (కాంగ్రెస్), 11వ వార్డు రెబ్బాసు మహేష్ (స్వతంత్ర), 12వ వార్డు సుమాయ తబుస్సమ్ (స్వతంత్ర), 13వ వార్డు గుడికందుల అజయ్ (కాంగ్రెస్), 14వ వార్డు నుంచి దొనికెల శిరీష నవీన్ (బీజేపీ), 15వ వార్డు నుంచి అరిగెల శిరీష రాకేష్ (బీజేపీ), 16వ వార్డు నుండి అరిసె వనజ మురళీ (బీజేపీ), 17వ వార్డు నుండి మైలారపు లింబాద్రి (కాంగ్రెస్), 18 వ వార్డు నుండి చెట్లపల్లి మీనా సుఖేందర్ గౌడ్, 19వ వార్డు నుంచి బొడ్ల ఆనంద్ (బీజేపీ), 20వ వార్డు నుంచి మాసుల ప్రవీణ్ (కాంగ్రెస్), 21వ వార్డు నుంచి కాజా అజీముద్దీన్ (స్వతంత్ర), 22వ వార్డు అంగడి పురుషోత్తం (బీఆర్ఎస్), 23వ వార్డు నుంచి కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ (బీజేపీ), 24వ వార్డు నుంచి పూదరి జ్యోతి (బీఆర్ఎస్), 25వ వార్డు నుంచి ఆశ్ర ఫర్హిన (బీఆర్ఎస్), 26వ వార్డు నుంచి బొడ్ల రమేష్ (బీజేపీ) తరపున విజయం సాధించారు.
కోరుట్లలో…
ఒకటో వార్డులో మాధవి (బీఆర్ఎస్), 2వ వార్డులో హుమేర కౌసర్ (కాంగ్రెస్), 3వ వార్డులో మోర్తాడ్ లక్ష్మినారాయణ (కాంగ్రెస్), 4వ వార్డులో తెడ్డు శ్రీజ (కాంగ్రెస్), 5వ వార్డులో సోరుపక రమాదేవి (బీజేపీ), 6వ వార్డులో శిరీష (కాంగ్రెస్), 7వ వార్డులో గుగ్లవత్ శ్రీకాంత్ (బీజేపీ), 8వ వార్డులో తోట గంగాధర్ (కాంగ్రెస్), 9వ వార్డులో అభ్యర్థి ఎడ్ల జల (కాంగ్రెస్), 10వ వార్డులో దాసరి సునీత (కాంగ్రెస్), 11వ వార్డులో కస్తూరి లక్ష్మీనారాయణ (బీజేపీ), 12వ వార్డులో గడ్డమీది పవన్ (కాంగ్రెస్), 13వ వార్డులో తిరుమల వసంత (కాంగ్రెస్), 14వ వార్డులో రెంజర్ల కళ్యాణి (కాంగ్రెస్), 15వ వార్డులో మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ (బీఆర్ఎస్), 16వ వార్డులో పొట్ట సురేందర్ (బీఆర్ఎస్), 17వ వార్డులో సోగ్రబీ (కాంగ్రెస్), 18వ వార్డులో అబ్దుల్ రహీం (కాంగ్రెస్), 19వ వార్డులో మొహ్మద్ మోషిన్ (బీఆర్ఎస్), 20వ వార్డులో చిట్యాల లక్ష్మీనారాయణ (కాంగ్రెస్), 21వ వార్డులో షానాజ్ సుల్తానా (స్వతంత్ర), 22వ వార్డులో టేకుల శిరీష (బీఆర్ఎస్), 23వ వార్డులో పుప్పాల ఉమాదేవి (కాంగ్రెస్), 24వ వార్డులో శీలం జయలక్ష్మి (కాంగ్రెస్), 25వ వార్డులో కలాల రాధ (బీజేపీ), 26వ వార్డులో అన్నం లావణ్య (కాంగ్రెస్), 27వ వార్డులో తిరుమల వాసు (బీజేపీ), 28వ వార్డులో వెంకటేష్ (బీఆర్ఎస్), 29వ వార్డులో యాటం పద్మ (కాంగ్రెస్), 30వ వార్డులో షాహిద్ (కాంగ్రెస్), 31వ వార్డులో ఏలుగురి శ్వేత (బీఆర్ఎస్), 32వ వార్డులో వసీం ఉరేమన్ (బీఆర్ఎస్), 33వ వార్డులో రుద్ర సుజాత (బీజేపీ)లు విజయం సాధించారు.
జగిత్యాలలో…
ఒకటో వార్డు చెట్టే గంగాధర్ (స్వతంత్ర), రెండో వార్డు నుంచి దయాల చంద్రకళ శంకర్ (స్వతంత్ర), 3వ వార్డు రాగుల ప్రదీప్ (కాంగ్రెస్), 4వ వార్డు క్యాదాసు నవీన్ (కాంగ్రెస్), 5వ వార్డు వేముల శ్రీనివాస్ (బీజేపీ), 6వ వార్డు చీటి లక్ష్మి నారాయణ (స్వతంత్ర), 7వ వార్డు కోరుకంటి రాము (బీఆర్ఎస్), 8వ వార్డు తోట హరీష్ (బీఆర్ఎస్), 9వ వార్డు వారణాసి మల్లవ్వ (స్వతంత్ర), 10వ వార్డు చాంద్ పాషా (కాంగ్రెస్), 11వ వార్డు దేవేందర్ నాయక్ (బీఆర్ఎస్), 12వ వార్డు ప్రశాంతరావు- (కాంగ్రెస్), 13వ వార్డు సిరికొండ వరలక్ష్మీ (స్వతంత్ర), 14వ వార్డు బొల్లారపు స్వప్న (స్వతంత్ర), 15వ వార్డు సరిత (కాంగ్రెస్), 16వ వార్డు దుమాల రాజ్ కుమార్ (కాంగ్రెస్), 17వ వార్డు ఖాజా కమాలుద్దీన్ (కాంగ్రెస్), 18వ వార్డు కూతురు శేఖర్ (కాంగ్రెస్), 19వ వార్డు ఏనుగుల లావణ్య(స్వతంత్ర), 20వ వార్డు కూతురు రాజేష్ (కాంగ్రెస్), 21వ వార్డు సిరికొండ పద్మ (కాంగ్రెస్), 22వ వార్డు అరవ లక్ష్మి (స్వతంత్ర), 23వ వార్డు మమత రెడ్డి (స్వతంత్ర), 24వ వార్డు పవిత్ర (స్వతంత్ర), 25వ వార్డు సామల్ల జమున (స్వతంత్ర), 26వ వార్డు పులి రమ శ్రీధర్ (స్వతంత్ర), 27వ వార్డు గంగ లక్ష్మి (కాంగ్రెస్), 28వ వార్డు బైర్నేని భాగ్య(స్వతంత్ర), 29వ వార్డు తోపారపు లావణ్య రజనీకాంత్ (కాంగ్రెస్), 30వ వార్డు షాహినా బేగం (కాంగ్రెస్), 31వ వార్డు రాజీయోద్దీన్ (ఎంఐఎం), 32వ వార్డు బడుగు పద్మ రాజేందర్ (కాంగ్రెస్), 33వ వార్డు సుజాత (కాంగ్రెస్), 34వ వార్డు అయూబ్ ఖాన్ (ఎంఐఎం), 35వ వార్డు జీనత్ పర్వీన్ మున్నా (స్వతంత్ర), 36వ వార్డు కోరే జయ (కాంగ్రెస్), 37వ వార్డు కొక్కు అనిత (బీజేపీ), 38వ వార్డు పిట్ట ధర్మరాజు – (కాంగ్రెస్), 39వ వార్డు బోల్సని శ్రీనివాస్ (కాంగ్రెస్), 40వ వార్డు అడువాల జ్యోతి (కాంగ్రెస్), 41వ వార్డు గుండారపు సాయి కిరణ్ (కాంగ్రెస్), 42వ వార్డు నాగరాజు (బీజేపీ), 43వ వార్డు సమీండ్ల వాణి (కాంగ్రెస్), 44వ వార్డు ఆవారి పవిత్ర శివ కేసరి బాబు (బీఆర్ఎస్), 45వ వార్డు మానస జ్ఞానేశ్వర్ (బీజేపీ), 46వ వార్డు అనీస్ కుతేజ్ (స్వతంత్ర), 47వ వార్డు మొహమ్మద్ వసికుద్దీన్ అన్సారీ (కాంగ్రెస్), 48వ వార్డు కొండ అరుణ (బీజేపీ), 49వ వార్డు సిరిపురం శ్రీలత శ్రీనివాస్ (బీజేపీ), 50వ వార్డు మూలస్థం లావణ్య మహేష్ (కాంగ్రెస్) గెలుపొందారు.
రాయికల్ మున్సిపల్ లో…
రాయికల్ మున్సిపల్ లో 1వ వార్డు నుంచి తోపారపు ప్రశాంతి (బీజేపీ), 2వ వార్డులో కట్కం రవీందర్ (బీఆర్ఎస్), 3వ వార్డులో భూక్య రమేష్ నాయక్ (కాంగ్రెస్), 4వ వార్డులో తురగ సౌజన్య (బీఆర్ఎస్), 5వ వార్డులో కునారాపు మానస (బీజేపీ), 6వ వార్డులో వేముల మౌనిక (బీజేపీ), 7వ వార్డులో ఎలిగేటి లతిక (బీఆర్ఎస్), 8వ వార్డులో పల్లికొండ గంగాధర్ (కాంగ్రెస్), 9వ వార్డులో బత్తిని మహేశ్వరీ (స్వతంత్ర), 10వ వార్డు మచ్చ గంగాలక్ష్మీ (కాంగ్రెస్), 11వ వార్డు పుర్రె శ్రీధర్ (బీజేపీ), 12వ వార్డులో కల్లెడ చిన్న ధర్మపురి (బీజేపీ) గెలుపొందారు.
ధర్మపురిలో క్లీన్ స్వీప్…
ధర్మపురి మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1వ వార్డు నుంచి అయ్యోరి వేణుగోపాల్, 2వ వార్డు సంఘనభట్ల సంతోషి, 3వ వార్డు ఇందారపు రామయ్య, 4వ వార్డు కొమురెల్లి పవన్ కుమార్, 5వ వార్డు వేముల నాగలక్ష్మి, 6వ వార్డు ముడుసుల ప్రశాంత్, 7వ వార్డు వంకుధోత్ విజయ్ బాబు, 8వ వార్డు జంజిరిజానీ సువర్ణ, 9వ వార్డు వీరవేణి నాగలక్ష్మి, 10వ వార్డు ఆనంద్ సంగి, 11వ వార్డు జక్కు పద్మ, 12వ వార్డు చుక్క సంధ్య, 13వ వార్డు చిపిరి శెట్టి రాజేష్, 14వ వార్డు వేముల రమాదేవి, వొజ్జల లక్ష్మణ్ లు గెలుపొందారు.