నవగీతం, పెద్దపల్లి:
పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన నూగిళ్ల మల్లయ్యను విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు.జిల్లా అధ్యక్షులు భీమోజు సురేందర్ చారి నాయకత్వంలో చైర్మన్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం నాయకులు,ఆయనకు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సురేందర్ చారి మాట్లాడుతూ సామాన్య కార్యకర్త స్థాయి నుండి మున్సిపల్ చైర్మన్‌గా ఎదిగిన నూగిళ్ల మల్లయ్య నాయకత్వంలో పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగులమల్యాల ప్రసాద్,జిల్లా కార్యదర్శి గర్రెపల్లి రాజు,ఉపాధ్యక్షులు చేల్లోజు సుదర్శన్,బీసీ సంఘం నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్లతో పాటు అలువోజు మునేందర్,బి.హరీష్,బి.బాస్కర్,నూతి రవేందర్ మరియు ఇతర విశ్వబ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు