మున్సిపల్ చైర్మన్ కు విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం సన్మానం
నవగీతం, పెద్దపల్లి: పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన నూగిళ్ల మల్లయ్యను విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు.జిల్లా అధ్యక్షులు భీమోజు సురేందర్ చారి నాయకత్వంలో చైర్మన్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం నాయకులు,ఆయనకు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సురేందర్ చారి మాట్లాడుతూ సామాన్య కార్యకర్త స్థాయి నుండి మున్సిపల్ చైర్మన్‌గా ఎదిగిన నూగిళ్ల మల్లయ్య నాయకత్వంలో పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం...