మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నవగీతం,జగిత్యాల ప్రతినిధి: ఎన్నికల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓటు హక్కు వినియోగం తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్...