navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 6:09 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని మాల వర్గానికి ఇవ్వాలి

మాల సంఘాల జేఏసీ జనరల్ సెక్రెటరీ బిట్లుగు కార్తీక్

నవగీతం, మెట్ పల్లి టౌన్ :

మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని మాల వర్గానికి ఇవ్వాలని మెట్ పల్లి మాల సంఘాల జేఏసీ జనరల్ సెక్రెటరీ బిట్లకు కార్తీక్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బాగా 13వ వార్డు, 16వ వార్డు, నాలుగో వార్డ్ ఎస్సీలకు కేటాయించడం జరిగిందని, మాల సామాజిక వర్గానికి వైస్ చైర్మన్ పదవిని ఇవ్వాలని అన్నారు. మెట్ పల్లి మున్సిపాలిటీని కొమిరెడ్డి రాములు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ ఏర్పాటు కొరకు మాల సంఘాలు ఆనాటి మెట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములుకు మునిసిపాలిటీని ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారని, మున్సిపాలిటీ ఏర్పాటలో మాల సంఘాలు ఎంతో కృషి చేశాయని అన్నారు. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు మాలలకు మెట్ పల్లి మున్సిపాలిటీలో అన్యాయం జరిగిందని అన్నారు. మున్సిపాలిటీ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన మాలలకు అన్యాయం జరగకూడదని, దాని కొరకు తాము కలిసికట్టుగా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము.