navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 7:42 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మురుగు నీరు ఇలా… నివసించేది ఎలా…!!??

– జనవాసల మధ్య మురికి నీరు

– పట్టించుకోని మున్సిపల్ అధికారులు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మురికి కాలువల నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో జనవాసాల మధ్యలో మురికి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పట్టణంలోని 14వ వార్డులో ప్రజలు నివసించే ప్రాంతంలో ఇళ్ల చుట్టూ మురికి నీరు చేరి దుర్గంధంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాల్సి ఉండగా సంబంధిత మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో గత కొన్ని రోజులుగా ఇక్కడి ప్రజలు పారిశుద్ధ్య నిర్వహణ లోపం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు పరిస్థితి పనులు చేపట్టడంతో పాటు దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.