మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు మెప్మా ఆర్‌పీల సన్మానం

నవగీతం, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్‌లను మెప్మా (MEPMA) ఆర్‌పీలు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు....