navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 3:30 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మెట్ పల్లిలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జీకి ఘన స్వాగతం

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ అభయ్ పటేల్ కు ఘన స్వాగతం లభించింది. మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా జిల్లాల పర్యటనలు చేస్తున్న సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ అభయ్ పటేల్ జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయానికి వచ్చారు. పట్టణానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ఇంచార్జీ అభయ్ పటేల్ కు పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ అభయ్ పటేల్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీలు, పార్టీ ప్రతినిధులకు, సలహాలు సూచనలు అందించారు. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి పార్టీకి ఓటేసే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి బీజేపీ ఎన్నికల ఇంచార్జీ అమ్దాపూర్ రాజేష్, ఎన్నికల జోనల్, వార్డు ఇంచార్జీలు వడ్డేపల్లి శ్రీనివాస్, ఏలేటి నరేందర్ రెడ్డి, బద్దం గంగాధర్ రెడ్డి, పీసు రాజేందర్ రెడ్డి, గోపిడి శ్రీనివాస్ రెడ్డి, ఎర్ర లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.