navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 8:39 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మెట్ పల్లి ప్రజలకు రుణపడి ఉంటాం..

బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి :

మున్సిపల్ ఎన్నికల్లో మెట్ పల్లిలో నమ్మకంతో అధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించిన పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, పట్టణ సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పేర్కొన్నారు. గత రెండు రోజుల క్రితం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపుతో మెట్ పల్లికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. మెట్ పల్లి పట్టణంలో తమ అంచనా ప్రకారం 26 వార్డులకు 14 వార్డులు గెలుస్తాం అనుకున్నామని, కానీ పది స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు. బీజేపీ గతంలో మెట్ పల్లికి కంచుకోటగా ఉందని, ఇక్కడి నుండి సీనియర్ నాయకులు చెన్నమనేని విద్యాసాగర్ 4 సార్లు ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదం ఉన్నప్పుడు రెండు దఫాలు కోరుట్ల నియోజకవర్గ వర్గ ప్రజలు బీఆర్ఎస్ కు మొగ్గు చూపారని, ఇప్పుడు మళ్లీ బీజేపీకి ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో మెట్ పల్లిని స్మార్ట్ సిటీగా మార్చుకోవడానికి అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణలో మార్పు మెట్ పల్లి నుంచే మొదలయిందని, త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ హవా ఉంటుందని పేర్కొన్నారు. కాగా మెట్ పల్లిలో తమతో కలిసి మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకోవడానికి సహకరించే మైనారిటీలకు వైస్ చైర్మన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇతర ఏ పార్టీ కూడా మైనారిటీలకు వైస్ చర్మన్ పదవి ఇస్తామని చెప్పలేదని అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన మైనారిటీ కౌన్సిలర్లు టచ్ లో ఉన్నారని తెలిపారు. ధర్మపురి అరవింద్ నేతృత్వంలో తమకు సహకరించే మైనార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు వైస్ చైర్మన్ ఇస్తామని మాకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మెట్ పల్లి ఎన్నికల ఇంచార్జీ అమ్దాపూర్ రాజేష్, పోలీస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.