మొబైల్‌లో సిమ్ లేకపోతే.. వాట్సాప్ పనిచేయదు

ఎల్లుండి నుంచి కొత్త రూల్ అమలు నవగీతం, హైదరాబాద్:(టెక్నాలజీ) మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ తర్వాత సిమ్‌ లేకుండా వాట్సాప్‌ పనిచేయదు. వాట్సాప్‌ వాడాలంటే సిమ్‌ తప్పనిసరిగా ఉండాలంటూ జారీచేసిన ‘సిమ్‌ అనివార్యం’ నిబంధనకు ఫిబ్రవరి 28 డెడ్‌లైన్‌గా కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ డెడ్‌లైన్‌ను పొడిగించబోమని కేంద్రం స్పష్టంచేసింది. జాతీయ భద్రతకు, సైబర్‌ నేరగాళ్ల నుంచి యూజర్లను కాపాడేందుకే వీటిని అమలులోకి తెస్తున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు....