నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని మోత్కూరావుపేట జంగల్ లో పెద్దపులి సంచారిస్తుంది అనే సమాచారం తో ఫారెస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించగా, పాదముద్రలు గుర్తించి పెద్దపులి పాదాలుగా నిర్ణయించారు. మోత్కూరావుపేట లోని బండగుట్ట, మైసమ్మ గుడి ప్రాంతంలో పాదముద్రలు గుర్తించారు. (చందుర్తి-తొర్తి ప్రాంతం) మోత్కూరావుపేట నుండి చందుర్తి జంగల్ రోడ్డు గుండా వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోగలరని అటవీశాఖ అధికారులు తెలిపారు.
