మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
- జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల పుష్కరఘాట్లను పరిశీలన నవగీతం, జగిత్యాల ప్రతినిధి: గోదావరి పుష్కరాల సందర్భంగా ఘాట్లపై అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రత్యేక దృష్టి సారించామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని గోదావరి నది తీరంలో గల ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల పుష్కర ఘాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. 2027 జూలై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, రోడ్లు, ఘాట్లు, విద్యుత్ అభివృద్ధి...