నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిచిన ప్రజావాణి కార్యక్రమం తిరిగి 23.వ తేదీ సోమవారం రేపటి నుండి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల23 సోమవారం నుండి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిని యథాతథంగా నిర్వహించి వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు నేరుగా స్వీకరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.