నవగీతం,ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వైశ్య భవన్ ఫంక్షన్ హాల్ లో యువజన సంఘాల సమావేశ నిర్వహించారు. అనంతరం యువజన సంఘాల అధ్యక్షుడిగా రేగుల కార్తీక్ ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు రేగుల కార్తీక్ మాట్లాడుతూ యువజన సంఘాన్ని మరింత బలోపేతం చేసి యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతానని అని అన్నారు. గ్రామంలో క్రీడలు, సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టి యువతను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సంఘ సభ్యులు, యువకులు కార్తీక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిని సర్పంచ్ ఎం రాజు, మాజీ అధ్యక్షుడు ఉప్పల అమరేందర్ పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మామిడి సంజీవ్, కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, ఎంపీటీసీ కొయ్యడ భాస్కర్, వార్డు సభ్యులు, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.