రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులకు విప్పలమడక సర్పంచ్ ఎంపిక

ఉత్తర్వులు మంజూరు చేసిన డిపిఓ నవగీతం, వైరా ప్రతినిధి: హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ భవన్ లో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి మహిళా గ్రామ పంచాయితీ సర్పంచ్ల శిక్షణా తరగతులకు వైరా మండలంలోని విప్పలమడక గ్రామ సర్పంచ్ మేడా హేమిమా చక్రపాణిని జిల్లా పంచాయతీ రాజ్ అధికారులు ఎంపిక చేశారు. ప్రతి జిల్లా నుంచి నలుగురు మహిళా సర్పంచులను ఈ శిక్షణా తరగతులకు ఆహ్వానం అందిస్తున్నారు....