నవగీతం,కొడిమ్యాల:
ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీలలో కొడిమ్యాల ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థిని అడెల్లి అమూల్య ప్రతిభ కనబరిచింది.‘టెడ్ ఎడ్యుకాస్ట్’ ఉపన్యాస పోటీలో జూనియర్ విభాగంలో పాల్గొని విశేష ప్రతిభ చూపిన అమూల్యను పాఠశాల ప్రిన్సిపాల్ బి. లావణ్య అభినందించారు. ఈ సందర్భంగా గైడ్ టీచర్ జి.వి. రమణను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు.రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన అమూల్యకు విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (డైట్) కన్వీనర్ మంగారెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేశారు. ‘టైమ్ వినియోగం’ అంశంపై ఉపన్యాసం ఇచ్చి బహుమతి అందుకున్న అమూల్య రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కృషి చేస్తానని తెలిపింది.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బి. లావణ్య మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ, వారి ప్రతిభను వెలికితీసేలా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు.