navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 4:09 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపిక

నవగీతం,కొడిమ్యాల:

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలు ఫిబ్రవరి 1న కరీంనగర్ జిల్లా నగునూరు గ్రామంలో నిర్వహించగా, కొడిమ్యాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి సీ.హెచ్. శివ సాత్విక్ ప్రతిభావంతంగా ఆడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.ఈ నెల 6 నుంచి 8 వరకు నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి గ్రామంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీల్లో శివ సాత్విక్ పాల్గొననున్నాడు.ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థిని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బి. లావణ్య, ఫిజికల్ డైరెక్టర్ డి. అనూప్ రెడ్డి, మోడల్ స్కూల్ ఉపాధ్యాయ బృందం అభినందించి, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.