నవగీతం,హైదరాబాద్:
కూకట్ పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) చిన్నారెడ్డి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.ముందుగా ఫిర్యాదు అందడంతో పక్కా ప్రణాళికతో వలపన్నిన అధికారులు, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఏసీబీ స్పష్టం చేసింది.