navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 1:44 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పలు ఆలయాలను దర్శించుకున్న జువ్వాడి

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండలంలోని వెంకటరావుపేట్, గొర్రెపల్లి , పాత దామరాజ్ పల్లి, గ్రామాలలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలలో ఏటా అనాదిగా మాఘ పౌర్ణిమ పురస్కరించుకొని ప్రతి ఏటా జరిగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేవస్థాన కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శన భాగ్యం కలిగించారు.

అలాగే ఆలయ కమిటీ దాతల  ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.ఈ ఉత్సవాలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జవ్వాడి కృష్ణారావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో వివిధ గ్రామాల సర్పంచులు కనుముల వెంకటేష్ ఎలేటి వెంకటరెడ్డి ఎగ్యారపు లింబాద్రి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎలాల జలపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతు శేఖర్ మహేష్ రెడ్డి మట్ల సోమయ్య , నారాయణ , సిరిపురం రవీందర్ , కోటగిరి ఆనంద్, బద్దం నర్సారెడ్డి, రఫీ, ఎల్లాల జీవన్ రెడ్డి ,రమణయ్య మాజీ సర్పంచులు జలపతి రెడ్డి ఆనంద్ గౌడ్ గంగా గౌరీశ్వర దేవస్థానం మాజీ అధ్యక్షులు కోమటిరెడ్డి కృష్ణారెడ్డి ఎల్లాల కృష్ణారెడ్డి బాల్సని రాములు తదితరులు పాల్గొన్నారు.