navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 7:16 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

లో వోల్టేజి సమస్య కి పరిష్కారం..

అదనపు ట్రాన్స్ఫార్మర్ బిగించిన విద్యుత్ శాఖ అధికారులు

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండల కేద్రంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు అదనపు 100.కేవి ట్రాన్స్ఫార్మర్, ఒకటి 160.కేవి అదనపు ట్రాన్స్ఫార్మర్ ను శనివారం విద్యుత్ శాఖ అధికారి మెట్ పల్లి డి ఈ మధుసూదన్ సాంకేతికంగా ఛార్జ్ చేయడం జరిగింది.ఈ మూడు అదనపు ట్రాన్స్ఫార్మర్ వల్ల మల్లాపూర్ ఊరిలో లో ఓల్టేజ్ సమస్య తగ్గించడం జరిగింది అని తెలియజేశారు. అలాగే జరగబోయే మహాశివరాత్రి జాతర సందర్భంగా గుట్ట కింద కూడా ఒక అదనపు 100.కెవి, ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ చేశారు, జాతర జరిగే సమయంలో తీసుకోవవలసిన జాగ్రత్తలు,సూచనలు విద్యుత్ సిబ్బందితొ ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి ,ఆలయ కమిటీ చైర్మన్ సంఘ రాజన్న, వైస్ చైర్మన్ తుక్కారం, తిరుపతి, సుంకేట జీవన్ రెడ్డి,విద్యుత్ శాఖ ఏడిఈ అమరేందర్ ,ఏఈ వినీత్ రెడ్డి , విద్యుత్ శాఖ సిబ్బంది వార్డు సభ్యులు,వివిధ గ్రామ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు