navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 7:45 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. పదో తరగతి పరీక్షల సన్నద్ధతకై జిల్లా అధికారుల సమన్వయ సమావేశాన్ని బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆధ్వర్యంలో 2025 -26 సంవత్సరానికి పదో తరగతి పరీక్షల సన్నద్ధతకై అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత మాట్లాడుతూ రాబోయే పదో తరగతి పరీక్షల కోసం అన్ని శాఖలు సమర్ధ వంతంగా సన్నద్ధం కావాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ పరీక్షా కేంద్రాల దగ్గర ఎటువంటి లోటుపాట్లు లేకుండా విద్యార్థులకు ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని వివరిస్తూ వైద్య సదుపాయం, రవాణా సౌకర్యం, పోస్టల్ శాఖపరమైన చర్యలు, 144 సెక్షన్ అమలు చేయడం లాంటివి, విద్యుత్ సౌకర్యం, ప్రమాదాల పట్ల, విద్యార్థుల భద్రతా పట్ల ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులు 100 శాతం లక్ష్యాలను సాధించుటకు తోడ్పాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కే. రాము, జిల్లా పరీక్షల విభాగం అధికారి నరేందర్, జిల్లా స్థాయి అధికారులు, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆర్టీసీ, ట్రెజరీ, ఫైర్ అండ్ సేఫ్టీ, జిల్లా పంచాయతీ శాఖ, విద్యుత్ శాఖ, పోస్టల్ శాఖ, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు హాజరయ్యారు.