విద్యాశాఖ అధికారులతో ఎఫ్.ఎల్.ఎన్ అమలు పై ప్రత్యేక సమీక్షా నిర్వహించిన కలెక్టర్
నవగీతం, పెద్దపల్లి:
విద్యార్థులందరికీ ప్రాథమిక సామర్థ్యాలు తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో విద్యాశాఖ అధికారులతో ఎఫ్.ఎల్.ఎన్ (FLN) అమలుపై జరిగిన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం పై పూర్తి పట్టు ఉండాలని, 3వ తరగతి పూర్తయ్యే నాటికి ప్రతి విద్యార్థి ధారాళంగా చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక గణిత సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు.

ఎం.ఈ.ఓ లు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు క్రమం తప్పకుండా పాఠశాలలను సందర్శించి, ఎఫ్.ఎల్.ఎన్ (తొలిమెట్టు) కార్యక్రమం అమలవుతున్న తీరును నిరంతర పర్యవేక్షించాలని, పాఠశాల విద్య లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా వారి సామర్థ్యాలు మేరుగుపడతాయని కలెక్టర్ అన్నారు. విద్యార్థులకు బోధనా ఉపకరణాలు సులభంగా అర్థమయ్యేలా టి.ఎల్.ఎమ్ (TLM -Teaching Learning Material) ను విద్యార్థులు వినియోగించుకోవాలని, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయుల చర్యలు తీసుకోవాలి కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శారద, అకడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం. షేక్ ఎం.ఈ.ఓలు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.