navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 8:29 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి

పదవ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు లోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు పాఠశాల పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అధికారులకు ఆదేశించారు. తప్పనిసరిగా పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించాలని, పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా ఉంచాలని అదేవిధంగా విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి,  వంటలు గ్యాస్ పొయ్యి మీదనే వండాలని,  కూరగాయలు తాజాగా ఉండాలని వంట సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు.

అదేవిధంగా కిచెన్ గార్డెన్ వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. పాఠశాల తరగతిలో పాఠాలు బోధించే ఉపాధ్యాయుల విధానము విద్యార్థులకు బోధించే విధానంను, భోజన వసతుల గురించి విద్యార్థులతో నేరుగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే క్రమశిక్షణ గల విద్య అవసరమని విద్యార్థులు అనుకున్న ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కిచెన్ గార్డెన్ లో కూరగాయల మొక్కలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు.అనంతరం కోరుట్ల పట్టణ కేంద్రంలోని జెడ్పి హెచ్ ఎస్ (గర్ల్స్) పాఠశాలలో నిర్మాణంలో ఉన్న సైన్స్ ల్యాబ్ ను పరిశీలన చేసి అక్కడి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మరియు కాంట్రాక్టర్లతో మాట్లాడి త్వరగా ఇట్టి సైన్స్  ల్యాబ్ పూర్తి చేయాలని త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని సూచించారు.

తదుపరి టీజీ ఎంఎస్ కల్లూరులో పీఎం శ్రీ పథకంలో భాగంగా జరుగుచున్న మేజర్ అండ్ మైనర్ పనుల ప్రగతిని పరిశీలించి అక్కడి కాంట్రాక్టర్ తో మాట్లాడి వారంలోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు. అలాగే  పాఠశాలలో ఎస్ఎస్సి విద్యార్థులు రాస్తున్నటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహణ తీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, డి.ఈ.ఓ రాము, తహసీల్దార్, ఎంపిడివో, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.