navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 6:45 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట

నవగీతం, జగిత్యాల ప్రతినిధి;

జగిత్యాల రూరల్ మండలంలోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి వంజరి పల్లి గ్రామంలో ప్రజా బాట నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విద్యుత్ ఏడి జవహర్ నాయక్  ఏఈ, సబ్ ఇంజనీర్, ఎస్ఎల్ఐ రాజమల్లు ,లైన్మెన్ రాజ లింగం, ఎఎల్ఎమ్స్ శ్రీకాంత్ ,మహేందర్ ,ప్రభాకర్ గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్, సెక్రటరీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడి జవహర్ నాయక్  మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై మా దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి తోడ్పడుతామని హామీ ఐచ్చారు. సర్పంచ్ పలు సమస్యలపై విన్నవించగా అధికారులు సానుకూలంగా స్పందించారు.