navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 7:41 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వివిరావుపేట్ గల్ఫ్ సంఘం నూతన కమిటీ నియామకం

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండలం వివి రాపేట్ గ్రామంలో గల్ఫ్ కార్మిక సంఘ నూతన కమిటీని వ్యవస్థాపక అధ్యక్షులు పెనుకుల అశోక్, సభ్యుల ఆధ్వర్యంలో నియమించారు. గల్ఫ్ కార్మిక సంఘం అధ్యక్షునిగా ఆరెల్లి మహేష్ , ఉపాధ్యక్షులుగా నలిమెల ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా మండే ప్రవీణ్ , కోశాధికారిగా ముత్కల నవీన్ సలహాదారునిగా పోతు రఘు, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సంద స్వామి, కార్యదర్శిగా కనుమూల విశాల్, ఐ టి విభాగం కన్వీనర్ గా గుగ్గులావత్ శ్రీకాంత్, కో కన్వీనర్ జాల భూమేష్ ని నియమించారు.  ఈ నియమికం తక్షణమే అమల్లోకి వస్తుందని ఈ కమిటీ గల్ఫ్ కార్మికుల కోసం సేవలు అందించేందుకు కృషి చేయాలని పెనుకుల అశోక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల నాయకులు రొడ్డ నవీన్  కృష్ణారెడ్డి తిరుపతి శ్రీను మాజీ ఉపసర్పంచ్ రవి కుడుదల శశి  తదితరులు పాల్గొన్నారు