వృధా ఖర్చులకు మంగళం..సంక్షేమానికి జై

ఐదేళ్ల ఆత్మగౌరవాన్ని డబ్బుకు అమ్మకండి నవగీతం,పెద్దపల్లి: సుల్తానాబాద్ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మహమ్మద్ యూసుఫ్ అలీ ఎన్నికల ప్రచారంలో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. రాజకీయం అంటే వ్యాపారం కాదని,అది ఒక బాధ్యత అని చాటిచెబుతూ ఎన్నికల వేళ మద్యం,డబ్బు పంపిణీకి తాను పూర్తిగా వ్యతిరేకమని ఆయన ప్రకటించారు. ప్రచార ఆర్భాటాలకు, ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఖర్చు చేసే సుమారు 15 నుండి 20 లక్షల రూపాయలను వృధా చేయకుండా,ఆ సొమ్మును నేరుగా వార్డు ప్రజల సంక్షేమం కోసమే వాడాలనే సంకల్పంతో ఆయన...