navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 12:00 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వేంకటేశ్వర స్వామి వారి షష్ఠమా వార్షికోత్సవ బ్ర‌హ్మోత్స‌వాల‌ కరపత్రిక ఆవిష్కరణ.

నవగీతం, హైదరాబాద్:

తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి షష్ఠమా వార్షికోత్సవ బ్ర‌హ్మోత్స‌వాల‌ ఆహ్వాన కరపత్రికను టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, హైదరాబాద్, జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర టెంపుల్  లోకల్ అడ్వైసరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ.వేంకటేశ్వరా రెడ్డి, హైదరాబాద్ టీటీడీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూ రమేష్ ల చేతులమీదుగా జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16 సోమవారం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఆలయంలో ఈ నెల 17 మంగళవారం నుండి 26 గురువారం వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల10 మంగళవారం ఉదయం 7 గంటల నుండి 10:30 వరకు కోయిల్ అళ్వార్ తిరుమంజనం, 16 సోమవారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంట‌ల వ‌ర‌కు పుణ్యాహవాచనం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్ప‌ణ కార్య‌క్రమాలు  బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఉదయం 8 గం.ల నుండి 9 గం.ల వరకు, రాత్రి 7గం.ల నుండి 8 గం.ల వరకు స్వామివారు వివిధ వాహన సేవలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.ఈ కార్యక్రమాల అనంతరం బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా టీటీడీ  ఆధ్వర్యంలో కళాకారులు ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను, అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు. ఈ మేరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ బోర్డు మాజీ మెంబర్ రమణారెడ్డి, ఆలయ సూపర్డెంట్ నిరంజన్, హరికృష్ణ, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు.