వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు నవగీతం , హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం 10: 30 నుండి 11:00 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.వేదపండితుల మంత్రోచ్ఛారణలు,మంగళ వాయిద్యాలు,భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన,...