వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి గరడసేవ

జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరుడు దర్శనంతో తన్మయత్వంలో భ‌క్తులు టీటీడీ ఏర్పాట్ల‌పై భ‌క్తుల ప్ర‌శంస‌ నవగీతం, హైదరాబాద్: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై శ్రీ‌నివాసుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ అవతారం మాయా మోహ నాశ‌నం. విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది.స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం...