navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 7:31 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

శాస్త్రోక్తంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి చక్రస్నానం

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వెంక‌న్న బ్రహ్మోత్సవాలు.

నవగీతం, హైదరాబాద్:

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా ఉదయం స్వామి, అమ్మవార్లకు, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు పల్లకీ ఉత్సవం, స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం ఉద‌యం 8 గంట‌ల‌కు చ‌క్ర‌స్నానం ఘ‌నంగా జ‌రిగింది. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. సాయంత్రం 6 గంట‌లకు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వం, అనంతరం ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటిరోజు ధ్వజారోహణం తో గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం అని అర్చకులు తెలిపారు.ఈ వాహ‌న‌సేవ‌లో టీటీడీ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర టెంపుల్ లోకల్ అడ్వైసరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ వేంకటేశ్వరా రెడ్డి, హైదరాబాద్ టీటీడీ ఎఈఓ యూ రమేష్, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్పెక్టర్స్ నిరంజన్, హరికృష్ణ, మాజీ లోకల్ అడ్వైసరీ కమిటీ మెంబర్ బివి రమణారెడ్డి, పలువురు అధికారులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.