శాస్త్రోక్తంగా శ్రీ వేంకటేశ్వరస్వామి చక్రస్నానం
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వెంకన్న బ్రహ్మోత్సవాలు. నవగీతం, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా ఉదయం స్వామి, అమ్మవార్లకు, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు పల్లకీ ఉత్సవం, స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటలకు చక్రస్నానం ఘనంగా జరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు ఆలయంలో...