శివలోకం చూసిన రాత్రి
నవగీతం, హైదరాబాద్: నంది శృంగద్వయంపైచేతివేళ్ళు నిలిపిశివుని దర్శనం కోసంకన్నులు తెరిచిచూడవాసుకి కంఠమందు పరివేష్టితుడైవిషాన్ని కంఠమునదాల్చిన మహాదేవుడు కానవచ్చె! త్రిశూలం ఎత్తి,త్రిగుణాలకు అతీతుడైత్రిలోకాలకు స్వామిడమరుకం మోగించి సృష్టి తాండవం చేసినవాడనాద బ్రహ్మంలోలయనృత్యం చేసిన శంభోజై మహాదేవ్! బిల్వపత్రాలు భక్తులచేతుల్లోఅర్చనకు ఒక్క ఆకైనా శివునికిప్రియమేనని చాటిభస్మం ధరించిభవబంధాలు భస్మమైపోయేలావిభూతి తీర్థంతో విశ్వాన్నిశుద్ధి చేసినవాడమూడవ కన్ను తెరిచికాముని భస్మం చేసినకరుణామయుడ,కాలాన్ని కాల్చిన కాలభైరవుడజటాజూటంలో గంగనుధరించిన జగద్గురువఅర్ధనారీశ్వరుడై అర్ధచంద్రుని అలంకరించినవాడభక్తిమయమైన నాహృదయంలోభస్మంగా, వాసుకిగా, నందిగా,త్రిశూలంగా, డమరుకంగా, బిల్వంగా నిండిపోయావుహర హర మహాదేవ…శంభో శంకరా! జాగరణతో నిండిన రాత్రిశివుని నామ స్మరణలో...