శివాజీ విగ్రహాన్ని అడ్డుకున్న పలువురు..?
సముదాయించిన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు నవగీతం,ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలో త్వరలో ప్రతిష్టాపించడానికి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గ్రామానికి తీసుకురాకుండా ఆదివారం కొంతమంది అడ్డుకోగా వారిని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు సముదాయించారు.కొద్ది రోజుల్లో జరిగే ప్రతిష్టాపనకు విగ్రహాన్ని గ్రామానికి తీసుకువస్తుండగా స్థానికులు కొంతమంది అభ్యంతరం తెలిపారు. ఆ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు దృష్టికి కార్యక్రమ నిర్వాహకులు తీసుకెళ్లారు. వెంటనే డాక్టర్ రఘు హుటాహుటిన అమ్మక్కపేట చేరుకొని విగ్రహ రాకకు అభ్యంతరం తెలుపుతున్న వారితో...