శ్రీవారి వైద్య సేవకులకు సౌకర్యాలపై చర్యలు – టిటిడి జేఈవో డా. ఎ. శరత్

నవగీతం,తిరుపతి: టిటిడిలో త్వరలో ప్రారంభించనున్న శ్రీవారి వైద్య సేవకులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై చర్యలు చేపట్టినట్లు టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ వెల్లడించారు. ఎస్వీ ఆయుర్వేద వైద్యశాల, స్విమ్స్, ఎస్వీ వేదిక్ యూనివర్శిటీలోని అవసరమైన భవనాల నవనీకరణలో భాగంగా అధికారులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టిటిడిలో శ్రీవారి వైద్య సేవకు అవసరమైన వైద్య రంగంలోని వివిధ విభాగాల నిపుణులకు అవసరమైన వసతి సౌకర్యం...