నవగీతం, మెట్ పల్లి
మెట్ పల్లి మోచి సంఘం ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు కావల్ల పెంటయ్య మాట్లాడుతూ భక్తి, సేవ, సమానత్వం అనే విలువలతో సమాజాన్ని జాగృతం చేసిన సంత్ రవిదాస్ బోధనలు మన జీవితాలకు దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షతో అహంకారాన్ని వదలి, మానవత్వాన్ని ఆలింగనం చేయమన్న ఆయన సందేశం మనషులందరూ సమానమని కులం కన్నా మంచి ప్రవర్తన ముఖ్యమని భోదించారు. కుల వ్యవస్థను, అంటరాని తనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమతావాదాన్ని భోదించారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు సంత్ గురు రవిదాస్ జయంతిని ఘనంగా జరుపుకొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కావల్ల పెంటయ్య , ప్రధాన కార్యదర్శి కావల్ల గంగాధర్, ఉపాద్యక్షులు రాయిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి ఓటారికారి మధు, బోధన్ కారి రాజు, బోధన్ కారి రమేష్, ఓటారికారి గోపి, కొండ్లేపు సాగర్, కొండ్లేపు గోపి, కావల్ల భాస్కర్, కొండ్లేపు మహేందర్, కావల్ల నరేష్, బోధన్ కారి మహేందర్, కొండ్లేపు విజయ్, కొండ్లేపు సాయిలు, కొండ్లేపు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు