నవగీతం,కరీంనగర్:
చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో ఈ నెల 5వ తేదిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సోమవారం కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ప్రభుత్వ అధికారులతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే , కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేడిపల్లి సత్యం సభ స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు