సర్పంచ్ కు ఇసుక మాఫియా బెదిరింపులు..
ఖబర్దార్ లారీతో తొక్కేస్తాం.. నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట గోదావరి పరివాహక ప్రాంతానికి సమీపంలోని నల్లమడుగు వద్ద జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై అభ్యంతరం తెలిపిన వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ కనుముల వెంకటేష్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. గత శుక్రవారం జేసీబీ సహాయంతో టిప్పర్ లారీల్లో ఇసుక అక్రమంగా లోడ్ చేస్తున్నారని తెలుసుకున్న సర్పంచ్ వెంకటేష్ అక్కడికి వెళ్లి ఇసుక రవాణా ఆపాలని వారిని నిలదీశారు. అక్రమంగా ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం, గ్రామ రహదారులు ధ్వంసం కావడం, భవిష్యత్తులో...