సిట్ విచారణ పేరుతొ కేసీఆర్‌పై ఎందుకీ కక్ష..?
నవగీతం,కొడిమ్యాల: కొడిమ్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కొడిమ్యాల మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు మాట్లాడుతూ కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యేనని ఆరోపించారు....