నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు ఆ సంఘాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. అనంతరం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ రూపొందించిన వయో వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం, పెన్షనర్స్ సర్వీస్ రూల్స్ పుస్తకాలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో రూ. కోటి రూపాయలతో తారకరామ నగర్ లో ప్రభుత్వ వృద్దాశ్రమాన్ని ఏర్పాటు చేశామని, అలాగే జగిత్యాల పట్టణ బై పాస్ రోడ్ లో డే కేర్ సెంటర్ ఏర్పాటు జరిగిందని, అందులో సీనియర్ సిటిజెన్లకు ఉచితంగా అల్పాహారం, వైద్య సేవలు, వినోద కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.హరి అశోక్ కుమార్ వినతి మేరకు పెన్షనర్ల సమస్యల పరిష్కారంకు ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్ళు తానన్నారు.. వయో వృద్ధుల, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పాటు పడుతున్న సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను, వారి సంఘాల ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, కార్యదర్శి గౌరి శెట్టి విశ్వనాతం, పెన్షనర్ల జిల్లా కార్యదర్శి పి. సి. హన్మంత్ రెడ్డి, సీనియర్ సిటిజెన్స్ ఉపాధ్యక్షులు పి.అశోక్ రావు, కోశాధికారి వి. ప్రకాష్ రావు, సంయుక్త కార్యదర్శి ఎం. డి. యాకూబ్, కోరుట్ల అధ్యక్షులు పబ్బా శివా నందం, జగిత్యాల యూనిట్ అధ్యక్షులు బి. రాజేశ్వర్,నాయకులు కొక్కుల ఆంజనేయులు,నాయిని సంజీవ రావు, సత్యనారాయణ, బాలయ్య, కట్ట గంగాదర్,కరుణ తదితరులు పాల్గొన్నారు.