నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
నూతనంగా గెలుపొందిన మెట్ పల్లి మున్సిపల్ పాలక వర్గ సభ్యులు గురువారం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సుందర చైతన్యానంద స్వామి వారిని కలిశారు. హైదరాబాద్ లో సుందర చైతన్యానంద స్వామి వారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్, పాలకవర్గ సభ్యులు నునుగొండ నరేష్, మాసుల ప్రవీణ్, బత్తుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.