స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్: డిఎస్పి రాములు
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు పోలీసులకు సహకరించాలి. నవగీతం,జగిత్యాల ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెట్ పల్లి డిఎస్పి రాములు మాట్లాడుతూ... ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం స్వేచ్చాయుతగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా...