హనుమంత వాహనంపై కోదండ రాముడు

వైభ‌వంగా స్వర్ణ రథోత్స‌వ‌ము గజవాహనంపై భక్తులకు కటాక్షించిన శ్రీవారు నవగీతం, హైదరాబాద్: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండ రాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహనసేవ ముందు మంగళవాయిద్యాల నడుమ, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది....