navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 8:17 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

1989 నుండి 2026 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవగీతం, కరీంనగర్:

సెంట్ ఆల్ఫోన్స్ ఫాదర్ టీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో స్కూలు స్థాపించిన సంవత్సరం 1989 బ్యాచ్ నుండి 2026 బ్యాచ్ వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. విద్యార్థుల సమ్మేళ కార్యక్రమంలో 1989 నుండి 2026 వరకు 37 సంవత్సరాల చదువుకున్న విద్యార్థులు పాల్గొని తమ స్కూల్లో గడిచిన పాత జ్ఞాపకాలను అందరితో పంచుకొని ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు.

అనంతరం 1993 – 1994 బ్యాచ్ కు చెందిన 71 మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణిత సాధించి స్కూల్ పేరును స్టేట్ ఫస్ట్ ప్లేసులో సాధించామని గర్వంగా చెప్పారు.. అనంతరం ఫాదర్ టి సంతోష్ కుమార్ పూర్వ విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు.. ఫాదర్ టి సంతోష్ కుమార్ ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ , డాక్టర్ రాజేంద్రప్రసాద్ , పెద్ది మల్లికార్జున్ , కృష్ణ ప్రసాద్ రాజు , పూర్ణచందర్ , ఈగ సంతోష్ , ఎస్ ఎస్ అరుణ్ కుమార్ , డాక్టర్ అనిల్ కుమార్ , సుమన్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.